murali sudha

Comedy

4  

murali sudha

Comedy

ఇందుమూలంగా

ఇందుమూలంగా

2 mins
371


*ఇందుమూలంగా.....*


'ఎస్వీ రంగారావు, ఏమోయ్ ఎస్వీ రంగారావు ఒక్కసారి బయటకు రావయ్యా' 


'ఎవరదీ, ఎవరు నన్ను ఏకవచనమున సంభోధించుచున్నదీ!'


'నేనేలేవయ్యా సూర్యకాంతాన్ని'


'ఓహో మీరా సూర్యకాంతం గారూ, అయినా ఏమిటా ఏకవచన పద ప్రయోగం, ఏమా ఆవేశం'


'ఆవేశం కాక , ఏక వచనంతో పిలవక నువ్వు చేసిన పనికి నిన్ను బుజ్జీ, బంగారు అని మెచ్చుకుంటారా ఏంటి'


'అంత కాని పని మేమేమి చేసితిమి'


'ఏం చేశాను? అని నన్నే అడుగుతున్నావా? ఆహా అంత మతిమరపూ వచ్చిందీ. అప్పుడెప్పుడో మా తాతవ్వకు తాతవ్వకు మాటిచ్చావు, ఇప్పుడు మనమరాలికి, మనమరాలి మనమరాలికి అడుగుతుంటే 'ఏం చేశాను' అంటూ రాగాలు తీస్తున్నావా? అనుకున్నా , అనుకున్నానువ్వో పెద్ద గజనీవని , మతిమరపు మారాజువని'


'అబ్బా కాంతం గారూ, ఏమి జరిగినదో చెప్పక ఈ సూటీపోటీ మాటలు ఏలండీ'


'ఏలాలా? నేనా? నువ్వు ఏలుతున్నావు స్వర్గాన్ని చాలదూ, నాకెందుకు ఆ భాగ్యం'


'హతవిధీ ఇది ఆ ఏలడం కాదండీ బాబూ, ఏల? ఎందుకు? అని అడుగుచుంటిని'


'ఆ...ఆ...అర్థం అయ్యి ఏడ్చింది కానీ. ఇంకా ఎన్నాళ్లు నీ ఈ దుర్మార్గ పాలన, దురహంకార ఇంద్ర నీతి అని స్వర్గం ఉలిక్కిపడేలా అడుగుతున్నా? ఏది, ఏదీ నీ సమాధానం?'


'ఇప్పుడు మీకేం అన్యాయం జరిగిందండీ'


'ఒక్క అన్యాయమేనా, ఎన్నెన్ని జరిగాయి మా ఆడవాళ్లకు'


'హవేమిటో సెలవివ్వండి'


'అప్పుడే సెలవు తీసుకుని చెక్కేద్దామనే'


'********'


'చెప్తాను విని అఘోరించు. అసలు మా ఆడవాళ్లకు స్వర్గలోకంలో ఏ సదుపాయాలు ఏర్పాటు చేశారు. మీ మగ మహారాజులకు మాత్రం రంభలు, ఊర్వశులు, మేనకలు, వాళ్ల నాట్యాలు, సురాపానాలు అబ్బో ఒకటా రెండా. మరి మా ఆడవాళ్లను మీరు ఏ విధంగా ఆనందపెడుతున్నారు'


'ఇదేమి విడ్డూరం కాంతం గారూ, ఇది ఎప్పటి నుంచో ఉన్న స్వర్గ ఆనవాయితీ, నేను ఎలా మార్చగలను'


'నాకు అవన్నీ తెలియదు. నువ్వు యమధర్మరాజు వేషం నుంచి ఇంద్రుడి వేషానికి మారావని మళ్లీ ఎక్కడ ఇక్కడ నుంచీ చెక్కేస్తావో తెలియక నువ్వు కొన్ని యుగాల క్రితం ఇంద్రుడు ఏ విహార యాత్రకో పోతూ, పోతూ నిన్ను ఓ వారం స్వర్గాన్ని చూసుకోమని చెప్పినప్పుడు నువ్వు ఆ ఆనందంలో మా ఆడవాళ్లకు ఇచ్చిన వరాల సంగతి నిన్ను గిల్లి, గిచ్చి గుర్తుచేసి నిన్ను అడిగి , కడిగి పోదామని వచ్చాను. ఏదో నీకూ- నాకూ ఆ మాత్రం పరిచయం, చనువు ఉన్నాయి కనుక. మా ఈ సమస్యలను నీవు ఇక్కడ వుండగానే తీర్చిపో'


'మీకు ఏ సౌకర్యాలు కావాలి కాంతం గారూ'


'మాకు పెద్ద పెద్ద చీరల షాపులు పెట్టించాలి, వాటిల్లో మీ మగవాళ్ళు మాత్రమే సేల్స్ మెంబర్స్ గా ఉండి, మేము కొన్నా,కొనకున్నా ఓపిగ్గా చూపించాలి. విసుక్కోకూడదు. ఇంకా బ్యూటీ పార్లర్లు ఏర్పాటు చేయాలి. నగల దుకాణాలు, అందులో కొత్తరకపు నగలు అమర్చాలి. ఇంకా మాకు వినోదం కోసం రంభడు, మేనకుడు, ఊర్వశుడు, తిలోత్తముడు ఇలా మగ నాట్య కారులను, మగ నటనా చాతుర్యులను ఏర్పాటుచేసి ప్రతీరోజు మమ్మల్ని ఆనంద పరచాలి'


**************


ఇలా వాగ్దాన భంగం చేసిన ఇంద్రుడు కమ్ యముడు గారు అయిన మన రంగారావు గారు కాంతం గారి లిస్ట్ వింటూ పడిపోవడం, ఇంకనూ లేవక పోవటం విచారకరం.


✍️✍️సుధామురళి


Rate this content
Log in

Similar telugu story from Comedy