చందమామకు మచ్చ అందం
చందమామకు మచ్చ అందం


–-----------------------------------------
అలసిపోయి వాలుతున్న సూర్యునికి సన్నని పూలవానల కురుస్తున్న చిరుజల్లు అభిషేకం చేస్తున్నట్లుగా ఉంది..
ఆగి ఆగి వీస్తున్న గాలికి కదులుతున్న మేఘాలు సూర్యుణ్ణి ముద్దాడటానికి వచ్చిన శ్వేతవస్త్ర దేవకన్యల్లా పోటీపడుతున్నాయి..
ఈ సుందర దృశ్యాన్ని చూసి మురిసిందేమో..నింగి నీలి రంగు కాన్వాసుపై ఏడురంగుల ఇంద్రధనుస్సును లిప్ స్టిక్ లా పూసుకుని సిగ్గుపడుతూ నవ్వుతుంది.
ఈ అందాలకు సవాలు విసురుతున్నట్లు..బంగారు రంగు మేని ఛాయాతో,గాలికి రెప రెప లాడే లేత గులాబీ రంగు ఉల్లిపొరలాంటి సన్నని చీరలో..మెడలో తెల్లటి ముత్యాల హారంతో..మేలిమి ముత్యంలా మెరిసిపోతూ సిటీ బస్సు కోసం ఎదురు చూస్తుo ది ఆరాధ్య.
చంద మామ లాంటి ఆమె ముఖానికి నల్లని కూలింగ్ గాగుల్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉన్నాయి.
మంచి హైట్ ..దానికి తగ్గ వెయిట్, చామన ఛాయా రంగైనా..చూడగానే ఎట్రాక్టివ్ గా కనపడే అభిరామ్, ఆ రోజు క్రీమ్ కలర్ పాంట్ పై నీలం రంగు షర్ట్ టక్ చేసి దానిపై క్రీమ్ కలర్ వాస్ కోట్ వేసుకొని ఎడమచేతిని కోటు పాకెట్ లో స్టయిల్ గా పెట్టుకొని అదే బస్సు కోసం ఎదురు చూస్తున్నాడు.
వాళ్లిద్దరూ గత ఆరు నెలలుగా అదే బస్ స్టాప్ లో ఒకరినొకరు చూసుకుంటున్నారు. కానీ ఎవ్వరు చొరవ తీసుకొని మాట్లాడే ప్రయత్నం చేయలేదు.
కానీ ఇద్దరిలో ఏదో అట్రాక్షన్ వారూ ఒకరిని ఒకరు ఇష్టపడేలా చేసింది.
వాళ్ళిద్దరిలో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే..ఆమె ఎప్పిడు తన కూలింగ్ గాగుల్స్ తీయదు.తీస్తే అతడినే చూస్తున్నానన్న...విషయం బైటపడుతుందని కాబోలు...
అతడు కూడా ఎప్పుడూ వాస్ కోట్..ప్యాకెట్లో చెయ్యి తీయలేదు.
తను ఎప్పుడు చూస్తుందో తెలియదు..చూసినప్పుడు ఇలా ఉంటేనే బాగుంటుందని కాబోలు....
ఈ ఆరు నెలల్లో ఆమె అబ్బా....ఆస్టైల్ తగ్గించి చెయ్యి పాకెట్లోనుండి తీయొచ్చుగా బాబు అని ఎన్నిసార్లు అనుకుందో...
అతడు అంతే..పున్నమి జాబిలమ్మ కు నల్లమబ్బు అడ్డొచ్చినట్లున్న .. ఆ కూలింగ్ గ్లాసెస్ తీస్తే ఎంత బాగుండునో అనుకునే వాడు.
అలా..వారూ ఒకరినొకరు చూసుకోవడం..వూహల్లో తెలిపోవడం,ఎప్పుడైనా ఇద్దరిలో ఒకరు రాక పోతే ఇంకొకరు ఎదురు చూడటం వేదన పడటం సహజంగా మారింది.
రోజులలా గడుచిపోతున్నాయి,ఆరోజు ఎప్పటిలాగే ఇద్దరు బస్సు కోసం ఎదురు చూస్తున్నారు..
ఇంతలో సన్నని జల్లు కాస్తా పెద్ద వర్షంలా మారింది. బస్ స్టాప్ నిండా జనాలు...బస్ స్టాప్ చివరకు నిలబడిన అభిరామ్ తడుస్తున్నాడు,.
ఆరాధ్య తన గొడుగును ఓపెన్ చేసి అభిరామ్ దగ్గరగా వెళ్లి ఇద్దరికి కలిపి తడవ కుండా గొడుగు పట్టుకుంది .
థాంక్స్ అండి అంటూ కాస్తా దగ్గరగా వచ్చాడు అభిరామ్.
ఇట్స్ ఒకే.. అంటూ సన్నగా నవ్వింది...ఆరాధ్య.
వేయి పువ్వులు విరిసి నట్లు,వంద వీణలు మ్రోగినట్లు అనిపించింది ఆమె నవ్వు అభిరామ్ కు.
అభిరామ్ ఉచ్వాస నిశ్వాసలు ఆరాధ్య మెడక్రింది భాగంలో తగులుతూ ఉంటే ఏదో తెలియని తమకం మత్తులా ఆవహిస్తున్నట్లనిపించింది.
ధైర్యం చేసి అభిరామ్ మీ పేరు అని అడిగాడు..
ఆరాధ్య.. అంది.
నాపేరు..అభిరామ్ అన్నాడు..
మీరేం చేస్తుంటారు అంది ఆరాధ్య.
నేను కెనరా బ్యాoక్ లో డిప్యూటీ మేనేజరుగా చేస్తున్నాను..
మీరు అన్నాడు అభిరామ్.
నేను.. జియోలాజికల్ డిపార్ట్మెంట్ లో సీనియర్ అసిస్టెంట్ గా చేస్తున్నాను అంది.
మీకు ఈ గాగుల్స్ స్పెషల్ అట్రాక్షన్ అన్నాడు అభిరామ్..ఏం మాట్లాడాలో తోచక.
తీయమంటారా అంది ఆరాధ్య...నవ్వుతూ...కానీ తనకు అవి తీయడం ఇష్టం లేదు.
వద్దండి..అవిలేకుండా నేను మిమ్మల్ని గుర్తుపట్టలేను..ఆన్నాడు చమత్కారంగా,మీరిలాగే బాగుంటారు అన్నాడు అభిరామ్.
థాంక్ యు అంది.. సుమధురంగా..ఆరాద్య
మీకు ఈ వాస్కోట్..స్పెషల్ ...
అందులో ఆ ఎడమచేయి కోటు పాకెట్ లో స్టైల్ గా పెట్టుకోవడం అడిషనల్ అట్రాక్షన్..అంది ఆరాధ్య.
తీయమంటారా అన్నాడు అభిరామ్..కూడా నవ్వుతూ..అతనికి అలా తీయడం ఇష్టం లేదు.
అయ్యో ..వద్దండి నాకు మీరిలాగే ఉండటం ఇష్టం అంది.
అలా వర్షంలో మొదలైన వారి పరిచయం.కృష్ణ పక్షపు చంద్రునిలా దినదిన ప్రవర్థ మానమైంది.
రోజు గంటల తరబడి మచ్ఛట్లు...పార్కుల్లో కలిసి కాలక్షేపాలు..పికాసో నుండి రవి వర్మ చిత్రాలవరకు హరిప్రసాద్ చౌరాసి ఫ్లూట్ నుండి, ఉస్తాద్ బిస్మిల్లా ఖా
న్ శహనాయి వరకు..
ట్రoప్ నుండి కిమ్ జోంగ్ వరకు, ఇండియా పాకిస్తాన్ పరోక్ష యుద్దo వరకు..ప్రపంచ ఆర్థిక మాంద్యం..ఆమేజాన్ ఆఫర్లు..ఇలా ఎన్నో చర్చలు వారిమధ్య జరిగేవి..
కానీ ఇద్దరికి ఇష్టమైన విషయాలనే ఎక్కువగా మాట్లాడేవారు..ఒకరిని ఓడించాలని మరొకరు ఎప్పుడు వాదించేవారు కాదు.
ఎదుటి వారి అభిప్రాయాన్ని గౌరవిస్తూనే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసేవారు,దీనితో ఒకరిపట్ల ఒకరికి మరింత గౌరవం అభిమానం..ప్రేమ ఏర్పడ్డాయి..
కానీ ఎప్పుడు హద్దులెరిగి ఉండేవారు.
ఒకరోజు అభిరామ్..తనకు ఆరాధ్య పై గల ప్రేమను చెప్పి, తను సరేనంటే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.
ఆరాధ్య కూడా అభ్యంతరం చెప్పలేదు...
ఇరుకుటుంబాలను ఒప్పించడం కష్టం అనిపించి, ఇద్దరు సింఫుల్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఒక మంచి ముహూర్తాన ఇద్దరూ... దంపతులయ్యారు.
ఆ రోజు వారీ శోభనం..
కడిగి చుక్కల ముగ్గులు పెట్టినట్లున్న నీలాకాశo శరత్కాలపు పున్నమి వెన్నెల కాంతులతో వెండి వాన కురుస్తున్నట్లుగా ఉంది.
ఆరు బయట చుక్కల పందిరి క్రింద వేసిన తెల్లని పాన్పు విరహాగ్నిని చల్లార్చడానికి ఆతృతగా ఎదురు చూస్తోంది.
డాబా పైకి ఎగబాకి పూసిన విరాజాజి పరిమళాలు ఆ ప్రాంతాన్ని మత్తెక్కిస్తున్నాయి.
దానికి తోడు శాండల్ స్టిక్స్.. సువాసనల పరిమళం కొత్తకోరికలకు ఊపిరి పోస్తుంది.
ఎన్నో వూసూలు చెప్పుకున్న ఆరాధ్య..అభిరామ్ లు.. ఆ సమయంలో మాటలు రాని మూగ వాళ్ళయ్యారు.
అభిరామ్ ..సుతిమెత్తని ఆరాధ్య చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు..
ఎక్కడో తెలియని తియ్యని వణుకు..లతలా ఒక్కక్షణం అల్లాడిపోయింది..ఆరాధ్య.
ఇద్దరు ఒకరికొకరు మరింత దగ్గరాగా జరిగారు...
తనకిష్టమైన ఆరాధ్య గాగుల్స్ ను తీసాడు అభిరామ్..
తనకిష్టమైన అభిరామ్ ఎడమ చేతిని తన చేతుల్లోకి తీసుకుంది ఆరాధ్య
ఇద్దరు ఒక్కక్షణం స్థాణువులయ్యారు..
మరో లిప్తి పాటులో ఇద్దరు ఆ రేయిని జయించడానికి ఉద్యుక్తులయ్యారు.
వారినిచూసి పుచ్ఛపువ్వులా పిండారా పోస్తున్న నెలరాజుకు చుక్కలు గుర్తొచ్చినట్లున్నాయి..ఓ ముద్దుకో ముచ్చటకో గాని మేఘాల దుప్పటిని చప్పున పైకి లాక్కొని..
ముసుగేసాడు.
ఆ మాత్రం మబ్బుతెరల అడ్డు తమ ఏకాంతానికేనేమో అనుకొని..ఈ ఇద్దరూ..తలపుల దుప్పట్లు విదిలించి వలపుల సయ్యాటలో పోటీపడ్డారు..
గెలిచారు .. ఓడారు..
ఒకరినొకరు గెలిపించారు..
ఒకరి నొకరు తెలుసుకుంటూ..
ఎక్కడెక్కడో విహరించారు..
ఇంకా దేనికోసమో వెతుకుతున్నారు....
తీరని దాహాగ్నిని తీర్చుకుంటూ..
విరహపు వేదనను చల్లార్చు కుంటూ..
అనంతమైన వారి ప్రేమ జల్లులో తడిసి..తడిసి ముద్దవుతున్నారు.
వారిరువురి నడుమ వూపిరాడక ఉక్కిరి బిక్కిరై నలిగిన పూబాలలు, వారి విరహాగ్ని తాపానికి తాళాలేక పాపం వడలిపోయి వొళ్ళు మరచి నిద్దురోతున్నాయి.
రేయి తెల్లవారుతుంది....
నా చెయ్యి చిన్నగా ఉందని బాధపడ్డావా అన్నాడు అభిరామ్....
ఆరాధ్య నవ్వింది.
నా కన్నోకటి చిన్నగా ఉందని మీరు బాధపడ్డారా..
అభిరామ్ నవ్వాడు..
బాహ్య సౌందర్యానికి బానిసలై..పై పై మెరుగులకు బ్రమపడి...అన్నీ ఉండి కూడా మనోవైకల్యంతో బాధపడే వారికన్నా,ఈ దిష్టి చుక్క ఒక లోపమా ..అంటూ ముద్దాడడు అభిరామ్.
ప్రేమతో నిండిన హృదయంలోని అంతః సౌందర్యాన్ని ఆస్వాదించలేని,మనసులేని మనిషి మనోవికారపు మాలిన్యాo ముందు..ఈ లోపం ఒక లోపమా అంటూ పరవశంతో ముద్దాడింది ఆరాధ్య.
వారిలోపాలను కూడా విశాల హృదయంతో క్షమించుకుంటూ...
ఈద్దరూ ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.
ఇద్దరూ ఒక్కటయ్యారు..
తెల్లవారుతుందన్న విషయాన్ని కూడా మరచి పోయారు.
ఒకరిలో ఒకరిని వెతుక్కుంటున్నారు.
ఎవరు..ఎవరో... తెలియని తహ తహ లాడే తనువుల తమకంలో..
ఈ ఆత్మ సౌందర్యాల..అనురాగాన్ని చూసి, చిరులోపాలు సిగ్గుతో తలవంచుకున్నాయి.
ఆ కాశంలో చందా మామలోని
మచ్చను చూసి ముచ్చటపడ్డ చుక్కలన్ని పక్కుకు చేరి పరవశిస్తూ.. తళుక్కున మెరిసాయి...
.......సమాప్తం....