చీకట్లో
చీకట్లో


చాలా చిత్రం.ఊరిలో ఎవరూ లేరు.అందరూ ఎటు పోయారు.
ఇంట్లోకి వెళ్ళాను.తలుపు తీయగానే కింద పడ్డాను.ఏదో సొరంగం.నా బొమ్మలన్నీ పడేసి ఉన్నాయి.అమ్మా ఎక్కడా అని పిలిచాను.అంతా చీకటి.
జేబులో అగ్గిపెట్టె తీసి ఒక అగ్గిపుల్ల కాల్చాను.ఏదో భయంకర రూపం.పరుగెత్తాను.మెట్లు కనిపించాయి.ఎక్కుతూనే ఉన్నాను.
ఎవరో నా కాలు పట్టుకొని లాగుతున్నారు.వెనక్కి పడిపోతున్నాను.ఆకలి వేస్తోంది.నా షర్టు చిరిగిపోయింది.
ఎవరో లైటు వేశారు.పక్కంతా తడిపేశావు.ఇంత పెద్ద అయినా నీకీ అలవాటు పోదేమిట్రా అని అమ్మ అరుస్తోంది.
హనుమాన్ చాలీసా చదివి నీళ్ళు తాగి పడుకో అని చెప్పింది.
ఇదంతా పీడ కలా.హమ్మయ్య అనుకున్నాను.