చదువు-సంపాదన
చదువు-సంపాదన


నువ్వేమైనా డబ్బు సర్దుబాటు చేయగలవా?నాన్న అడిగారు విశ్వాన్ని.
డబ్బులు ఇవ్వలేకపోతున్నాడు విశ్వం.
విశ్వం ఒక మోస్తరు ఉద్యోగం చేస్తున్నాడు.మంచి వాడే కానీ అతని జీతం అతని ఖర్చులకే సరిపోదు.ఇంట్లో చాలా అవసరం డబ్బు.
అమ్మను హాస్పిటల్ కి తీసుకెళ్ళి వైద్యం చేయించే స్థోమత విశ్వానికి లేదు.
తను చదివింది మంచి చదువే అయినా చదువుకు తగ్గ ఉద్యోగం సంపాదించుకోలేకపోవడంతో చాలా విషయాల్లో వెనకపడ్డాడు.
ఓ రోజు విశ్వం తన గదిలో ఉన్నాడు.ఎదురుగా అల్మారాలో తను ఎంతో కష్టపడి చదివిన పుస్తకాలు కనపడ్డాయి.
జీవితపు పరీక్షలో అవి తనకు ఉపయోగపడడం లేదని ఎక్కడో కోపం రగిలింది.
అగ్గిపెట్టె తీసి వాటిని కాల్చబోయాడు.
కాల్చేశాడు.
అంతా తగలబడిపోతోంది.ఆ మంటల్లో తను అమ్మా అని అరుస్తున్నాడు.
ఫోన్ రావడంతో విశ్వం నిద్రలోంచి బయటకు వచ్చాడు.అమ్మ ఆరోగ్యం కుదుటపడిందని మంచి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ జరిగినట్లు నాన్న చెప్పడంతో విశ్వం ఆనందంతో గంతులు వేశాడు.
ఫోన్ పెట్టేశాక అతడి కాళ్ళకి కాలిన పుస్తకాల బూడిద తగిలింది.