చైత్ర నవరాత్రులు
చైత్ర నవరాత్రులు


02-04-2020
ప్రియమైన డైరీ,
ఇవాళ దేశం లాక్ డౌన్ లో తొమ్మిదవ రోజు.
ఈ సారి చైత్ర నవ రాత్రులలో ఉపవాసం ఉండటం కుదరలేదు.
మనకు బాగా తెలిసిన శరన్నవరాత్రులు కాకుండా చైత్ర నవరాత్రుల్లో ఉత్తర భారతంలో చాలా చోట్ల భక్తులు ఉపవాసాలు ఉండి అమ్మవారిని ఆరాధిస్తారు.
క్రితం సారి ఉపవాసంలో తినే ఆహారం ప్రత్యేకంగా పెట్టుకునే వీలు ఉండేది. పళ్ళు దొరికేవి కాబట్టి ఇబ్బంది లేదు.
ఈ సారి అలా కాదు. పళ్ళు సరిగ్గా దొరకట్లేదు.
అమ్మా!ఈ మహమ్మారి వ్యాధిని సమూలంగా నిర్మూలించి మానవ జాతిని కాపాడు తల్లీ అని అమ్మవారి ముందు ప్రణమిల్లాను.