బిర్యాని బాబాయ్
బిర్యాని బాబాయ్
పేరు చక్రి.వీడొక వింత క్యారెక్టర్ దానికి తోడు బిర్యాని ప్రియుడు.చూడటనికి తమన్ కజిన్ బ్రదర్ లాగ ఉంటాడు. తినడం బరువు తగ్గడానికి పోవడం మల్లి బయటికి రాగనె బిర్యాని తినడం మనోడికి మాములే 😜.
చిన్నపటి నుంచి బాబుకి కావల్సింది ఎల ఐన దక్కించుకొవడం చక్రి అలవాటు దానికి బదులు సుకపురుషుడు అని చెప్తే బాగుంటదేమొ.వాడు లేకుండా గ్రూప్ లో ఎవరైనా ఎమైన మాట్లాడుకుంటునారు అంటే అది ఎంటి అని తెలుస్కునే వరకు నిద్రపట్టదు.
కావల్సింది దక్కించుకోవాలంటే మనోడికి ఉండే వెపన్ అలక తో కూడిన కోపం చదువు సక్రమంగా లేదు కాని అలక లో మాత్రం Phd చేసాడు😃 . మనోడికి కావల్సినవి మొత్తం అల అలకతో నే తెచ్చుకునెవాడు.ఇంట్లో ఎవరైన వీడు చెప్పిన మాట వినకపోఇన కావల్సింది వద్దన్న డోర్లు పగలగొట్టడం గ్లాస్ లు పగలగోట్టడం చిటికలో చేసేసేవాడు.స్కూలింగ్ కి వస్తే ఎ రోజు టైం కి వచ్చిన గనత లేదు క్లాస్ లు సక్రంగ వింటాడ అంటే అది కూడా లేదు.కాని మంచి షటిల్ ఆటగాడు.
రోజు కస్టపడి మరి స్కూల్ కి లేట్ గా వెల్లడం వెనక బెంచ్ లో కూర్చోడం గోల చేయటం సాయత్రం స్టడీ లు బంక్ కొట్టడం వారం చివరకి వచ్చేసరికి దాబాలకి ప్లాన్ చేయటం లేక గ్రూప్ అంతా ఒక చోట చేరి కిచిడి లు తినటం ఇదే మనోడి రోటిన్ లైఫ్,తినటం అంటే చాలు మనోడికి అమితమైన ప్రేమ.
పైనోకిందో పడి 10 కంప్లిట్ చేసి ఇంటర్ కి చేరాడు పాపం ఇంటర్ లో ఫుడ్ బాలేదొ లేక కావలసినవి టైం కి అందట్లేదో కాని అ ఇంటర్ కంప్లీట్ చేయటానికి మనోడు పడిన కష్టం అంత ఇంత కాదు.
