STORYMIRROR

Venkata Rama Seshu Nandagiri

Comedy

4  

Venkata Rama Seshu Nandagiri

Comedy

భార్యా! మజాకా!!

భార్యా! మజాకా!!

1 min
2.2K

కొత్తగా పెళ్లయిన జంట. తమ భవిష్యత్ ప్రణాళికలు చర్చించుకుంటున్నారు. 


భర్త : డియర్, పెళ్ళైనంత మాత్రాన, స్నేహాలు, స్వాతంత్ర్యం వదలుకోనక్కర్లేదని నా అభిప్రాయం. నువ్వేమంటావ్.


భార్య: నిజమే. మీరు అన్నదానికి నేనూ ఒప్పుకుంటాను.


భర్త: అయితే ఒకపని చేద్దాం. పండుగలు అన్నీ కలిసి చేసుకుంటాం కదా. పుట్టినరోజు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేసుకుందామా? (ఉత్సాహంగా అడిగాడు)


భార్య: సరే. కానీ, పెళ్ళిరోజు, వారాంతపు దినాలు, శలవు దినాలు కలిసే ఉండాలి. పనులు కూడా కలిసి మెలిసి చేసుకోవాలి. (షరతులు పెట్టింది భార్య)


తనన్నమాటకి ఒప్పుకుందన్న సంబరంలో అన్నిటికీ

ఓకే చెప్పేశాడు భర్త.


ముందు అతని పుట్టినరోజు వచ్చింది. సంతోషంగా చెప్పాడు, ఈరోజంతా శలవుపెట్టి స్నేహితులతో గడుపుతానని, ఇంటికి కూడా ఆలస్యంగా వస్తానని.

భార్య: సరే. మీ స్నేహితులతో హాయిగా గడపండి. నేనూ మీకోసమే శలవు పెట్టాను. నాకూ తోచదు కదా. నా కాలేజ్ మేట్ ఈ ఊరొచ్చాడు. తను నన్ను భోజనానికి రమ్మన్నాడు. మరి మేమిద్దరం ఈరోజు బైటికి వెళ్తాం. ఎందుకైనా మంచిది, తాళాలు పట్టుకెళ్ళండి.


(ఆ మాటతో భర్త ఉత్సాహం చప్పున చల్లారి పోయింది.)


భర్త: అబ్బే, ఊరికే అన్నానోయ్. నువ్వేమంటావోనని.

నిజానికి ఈరోజు నా ప్లాన్ అంతా నీతోనే. రెడీ అవు.

 

ఐని చెప్పి భర్త బాత్రూంలోకి దూరాడు. భార్య ముసిముసిగా నవ్వుకుంటూ తనూ రెడీ అవడానికి లేచింది.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Comedy