అతడే మన్మథుడా
అతడే మన్మథుడా


అదో వేసంకాలం మధ్యాహ్నం.వేడి గాలుల్లో కూడా మంచి నిద్ర పట్టింది.
నిద్ర లేచి చూశాను.ఏదో మత్తు వాసన.ఎవరతను.నా వైపే వస్తున్నాడు.ఆరడుగుల పైనే ఉంటాడు.రాతి పలకల్లాంటి ఛాతీ.నాభి వరకూ వస్త్రాలు లేవు.
లేత గులాబీ రంగు పెదాలు.పెద్ద కను బొమ్మలు.
అతడు నా చేయి పట్టుకున్నాడు.
అతడి శరీరం నుండి ఏదో పరిమళం.అదే మత్తు వాసన.
చేతికి పూల బాణాలిస్తే అచ్చుం మన్మథుడిలా ఉంటాడేమో.అతడి దేహం నా యదను తాకింది.అప్రయత్నంగా నా పెదాలు అతడి ఛాతీని చుంబించాయి.
నేనతని వైపు తల ఎత్తి చూశాను.వసంత మాసం
మా కలయికను కోరుతోందా అన్నట్లు పచ్చిక పైన అతడు పూలు పరిచాడు.
వీణా!వీణా!
లేవవే.ఎంత సేపు నిద్ర.
ఆదివారమంటే చాలు నిద్ర అంటావు.భోజనం చేద్దాం.లే.మళ్ళీ రేపు ఆఫీసుకి వెళ్ళవా.
నిద్రా దేవి ఆవహించిందా ఏమిటి అని నా స్నేహితురాలు నన్ను నిద్ర లేపింది.
ఏంటి ఇదంతా కలా?అని నేను లేచి కిటికీ వైపు చూశాను.పున్నమి నాటి చంద్రుడిలో నాకు మన్మథుడు కనిపించాడు.నా కలలో నన్ను కవ్వించిన ఆ అందగాడు కనిపించాడు.
హా!నిద్రా దేవి కాదు.రతీ దేవి ఆవహించినట్లుంది అంటూ నేను భోజనం చేయడానికి కదిలాను.