అమ్మమ్మకు అర్థం కాలేదు
అమ్మమ్మకు అర్థం కాలేదు


ప్రియమైన డైరీ,
ఇవాళ భారత్ మొత్తం లాక్ డౌన్ లో పదమూడో రోజు.
మా అమ్మమ్మ గారికి కొన్ని సంవత్సరాల క్రితం కాలు విరిగి ఆపరేషన్ చేశాక ఆవిడ ఇంటికే పరిమితమయ్యారు.
చాలా కాలంగా ఇంట్లోనే ఉంటున్నాను ఎక్కడికీ వెళ్లలేకపోతున్నాను అని చాలా బాధ పడేది.
గత కొద్ది రోజులుగా అందరూ ఇంటి పట్టునే ఉంటున్నారు.టీవీ రిమోట్ ఆమె కంట్రోల్ దాటిపోయింది.
రాత్రి పూట చెప్పే న్యూస్ వింది తను.అప్పుడే ఆమెకు కొంచెం అర్థం అయ్యింది.
బయట తిరగకుండా ఉంటే ఏదో వ్యాధి రాదని.
కొద్ది రోజుల పాటు అందరూ ఇళ్లలోనే ఉండాలని.
ఏంటో బయటికి వెళ్లగలిగిన వాళ్ళ పరిస్థితి కూడా నాలాగే తయారయ్యింది అని అనుకుంది మా అమ్మమ్మ.