అలసంద వడలు
అలసంద వడలు


ఈ కాలంలో పండక్కి ఊరు రావడం అంటే అమెరికాకు వీసా దొరికినట్లే తాతయ్యా.ఆఫీసు.ట్రాఫిక్ జాములు.
ఒకటే హడావిడి.ఏదో అదృష్టం బాగుండి లీవు దొరికింది అని పొయ్యి మీద బాణలి పెట్టాను.
అమ్మ నిశ్శబ్దంగా అలసంద వడలు వేయడానికి కొట్టిన పిండి కలుపుతోంది.
అమ్మ నూనె కాగిందని నిర్థారించుకొని కాస్త పిండిని తీసుకొని చపాతీలు రుద్దుకునే నునుపు బండపైన తడిపిన బట్ట వేసి వడ ఆకారం వచ్చేలా చేసి
మధ్యలో రంధ్రం చేసి నూనెలో వేయసాగింది.
అమ్మమ్మ వడలు బాగా కాలిన తరువాత బయటకు తీస్తోంది.
నాకేం చెయ్యాలో అర్థమయ్యింది.అమ్మమ్మ తీసిన వడలు నేను తింటూ ఏంటో అమ్మా!వడలు ఏమీ బాగాలేవు అన్నాను.
అమ్మమ్మ ముఖంలో రంగులు మారాయి.
ఏమిటే భావనా!పెద్ద తెలిసినదానిలా మాట్లాడుతున్నావు.నా కూతురు వడలు చేసిన రోజే సంకురాతిరి పండగని మా ఊరిలో అందరూ అంటారు తెలుసా.
చుట్టు పక్కల వాళ్ళయితే మీ అమ్మ చేసిన అలసంద వడలు కావాలని మళ్ళీ మళ్ళీ అడుగుతారు.
అంటూ ఓ వడ కొరికి నోట్లో వేసుకుని మిగతాది తినమని మా అమ్మకిచ్చింది.
సంవత్సరం నుంచి మాట్లాడని అమ్మమ్మ అలా మాట్లాడి వడ ఇచ్చేసరికి మా అమ్మ దానిని తిరుపతి లడ్డూ తింటున్నట్టుగా భావించి తృప్తిగా తింది.
నాకు వీరిద్దరి గొడవ విషయం చెప్పిన తాతయ్య మెచ్చుకోలుగా చూశాడు.
అమ్మా అమ్మమ్మలిద్దరూ అలసంద వడల గొప్పదనం గురించి మాటల్లో పడిపోయారు.
నేను వడలు తింటూ సంకురాతిరికి కృతజ్ఞత చెప్పుకున్నాను.