అజ్ఞాత రచయిత
అజ్ఞాత రచయిత
నేను రెండేళ్లుగా అతడు వ్రాసే కథల్ని ప్రూఫ్ రీడింగ్ చేసి ఎడిటర్ కి పంపిస్తున్నాను.ప్రతి వారం అతడి కథ కోసం ఎదురు చూడడం నాకు బాగా అలవాటు అయ్యింది.
సరిగ్గా శనివారం మధ్యాహ్నం అతడి కథ మెయిల్ వస్తుంది.నేను ప్ప్రూఫ్ రీడ్ చేసి ఎడిటర్ కి పంపించి ఆ కథకు తగిన చిత్రం ఎంపిక చేసి మరుసటి రోజు పత్రికలో ఖచ్చితంగా వచ్చేలా చూస్తాను.
ఎడిటర్ ఎప్పుడూ అతడి కథల్లో మార్పులు చెప్పలేదు.ఈ శనివారం మాత్రం అతడి కథ రాలేదు.
సాయంత్రం అవుతోంది.నాకు టెన్షన్ పెరిగిపోతోంది.
ఎడిటర్ దగ్గర అతడి అడ్రస్ తీ
సుకొని అతడి ఇంటికి వెళ్లాను.అతడెప్పుడూ తన పేరు వివరాలు గోప్యంగా ఉంచమని కోరేవాడు.అతడి ఇంటికి వెళ్లాను.ఇంట్లో ఎవ్వరూ లేరు.మేడ మీద గదిలోకి వ్రాస్తూ ఉన్నారేమో చూద్దామని చప్పుడు చేయకుండా వెళ్లాను.
నేను తలుపు సందు లోంచి తొంగి చూశాను.అక్కడ ఎవ్వరూ లేరు.అప్పుడే నా మెయిల్ కి నోటిఫికేషన్ వచ్చింది అతడి నుంచి కథ.గది లోపలికి వెళ్లి చూశాను.
అక్కడ ఓ కాగితం మీద ఇలా వ్రాసి ఉంది.
“నా కథల్లోని సందేశం వెతకండి.నన్ను కాదు.
ఈ అజ్ఞాత రచయిత ఇక దొరకడని ఉస్సూరుమంటూ నేను ఆఫీసుకి బయలుదేరాను.