Find your balance with The Structure of Peace & grab 30% off on first 50 orders!!
Find your balance with The Structure of Peace & grab 30% off on first 50 orders!!

కావ్య రాము

Drama

2  

కావ్య రాము

Drama

ఆడపిల్ల

ఆడపిల్ల

2 mins
379


భూమి ఇన్ని వేల కోట్ల జీవరాశులను,
దానికి జరిగే గాయాలను ఓర్పుతో తన ఒడిలో ఎలా దాచుకుంటుందో " ,


   "అదే విధంగా ఆడపిల్ల అంతే".

పుట్టిన క్షణం నుండి ఏదో ఒక అవాంతరాన్ని ఎదుర్కొంటుంది,ఆడపిల్ల పుట్టిందే అని కొందరు,తెల్లగా,నల్లగా పుట్టింది అని మరికొందరు,

ఆడపిల్లకు చదువెందుకని , బయటకు పంపద్దనిఇలా ఎన్నని ఆంక్షలు.........

ఎందుకు ఇంత చిన్నచూపు ఆడపిల్ల అంటే ?చిన్నతనం నుండే అందరితో కలుపుకుపోతూతలలో నాలుకలా ఉంటూ,అమ్మకు చేదోడు,వాదోడుగా,

నాన్నతో బాధ్యతగా,బయటి వాళ్ల చూపులనుండి తనను తాను కాపాడుకుంటూ ఉంటుంది.

అయినా సమాజంలో ఆడపిల్ల అనగానే

అందరి చూపులు ఒకలా ఉండవు ఎందుకు.?????


అమ్మ, నాన్న మాటలే తన ఆలోచనగా ఎవరిని చూపితే వారితో,

ఎలాంటి వాడైనా అతనితో నిండు నూరేళ్ల జీవితం మొదలుపెడుతుంది.

పెళై అత్తవారింట అడుగుపెట్టగానే

కొత్త వాతావరణం, సంప్రదాయాలు,

రకరకాల అనుభవాలు, భాద్యతలు, ఆచారాలు.ఇంతకు ముందు పరిచయం లేని మనుషులు.అందరు మనవాలే అనుకోవాలి,కొత్త కొత్త రుచులను, అభిరుచులనుచిన్న చిన్న కోరికలను ,

ఆశలను మనలోనే చిదిమేయాలి.

తన ఆశయాలను,ఆశలను,కలలను అనింటిని చెరిపి,ఒక ఇంటికి కోడలిగా,

భర్తకు భార్యగా,పిల్లలకు అమ్మగా, 

ఎలాంటి వాటికైనా ఎదిరించి నిలబడాలి.

అన్నింటిని ఓపికతో భరించాలి

ఎంత ఒదిగి ఉన్న ,ఎంతో ఆలోచించి భవిష్యతరాలకి దారిని చూపే అమ్మ పై చులకన భావన ఎందుకు!!!!!!

గృహిణిగా,భార్యగా,కోడలిగా,అమ్మగా 

భాద్యతలు నిర్వహించి ,కుటుంబ సంతోషంను పంచుతుంది

అయినా ప్రపంచం ఎప్పటికి మారదు

ఆడపిల్ల వహించే భాద్యత

 వంటగదికే పరిమితం ఎందుకు ????

ఆమె ఆలోచనలకు రూపం ఉండదెందుకు??ఏం జరిగిన తలవంచుకొని బ్రతకాలి.

ఎందుకు బయటి ప్రపంచానికి ఆమె దూరం??


భవిష్యత్ తరాలను ఇచేది ఆడది,

కుటుంబాని సక్రమంగా ఉంచుతూ,

మంచి,చెడులను తెలుపుతూ

 సమాజంలో తమ పిల్లలను

 మంచి పౌరులుగా నిలబెడుతుంది.

అలాంటి అమ్మని,ఆడపిల్లని 

ఎందుకు ఎదగనివ్వదు ఈ లోకం??

ఆడదానివి నీ వల్ల ఏమవుతుందిలే అని 

ఆమె ఓపికకు పరీక్ష పెడితే మాత్ర ం క్షమించదుమగమహరాజులు ఎక్కడినుంచో పుట్టలేదుమగాడి పుటుకకు కారణం ఆడదిఆ మగాడి వల్లనే ఆడపిల్ల ఎంతటి సహానశీలి అయిన

 అపరకాలిలా మారడం తథ్యo

   "క్షమయా ధరిత్రి"

********

భూమాత ఎంత ఓపికతో 

ఉంటుందో,ఆ ఓపిక నశించితే ప్రకృతిలా 

విలయతాండవంగా మారుతుంది.

 ఆడపిల్ల అని చులకనగా చూడకండి.

ఆమె మాటకు,ఆలోచనలకు విలువ ఇవ్వ ండి.

*****

ఈ మారుతున్న ప్రపంచంలో ఆడపిల్ల విషయంలో నాణెం కు ఒక వైపు నేటి యువత చాలా ముందుకు పోతుంటే, మరొక వైపు అదే సమయంలో అనాగరికతను అనుసరించి చాలా వెనకకు నెట్టి వేయబడుతుంది.

*********

బాల్యవివాహం,వరకట్న చావులు ఇలాంటి అనాగరికత, మూఢనమ్మకాల వలలో పడి ఆడపిల్ల బలి కాకుండా చూడాలి.

ఎప్పటికైనా కోరుకునేదిఒక్కటే ఆడపిల్ల అంటే తక్కువగాచూడకండి. నూతన ఆలోచనలతో ఆడపిల్ల కు విలువనివ్వ ండి.



Rate this content
Log in

More telugu story from కావ్య రాము

Similar telugu story from Drama