యువత
యువత
యువత కదిలిన చాలు తా ముద్యమించి
ప్రజలు వత్తురు తోడుగా భవితనిలుప
సర్వ కార్యముల్ సులువుగా సల్పుచుండు
సజ్జనాత్ములౌ యువతకు సాటి కలదె?
కొండలను పిండి చేసెడి గొప్పదనము
కలిగి యున్నట్టి యువతయే కలిమి మనకు.
శాస్త్ర విజ్ఞాన ఘనులిట శ్రద్ధతోడ
విబుధగతి నిపుణులగుచు విద్యనేర్చి
పేరు ప్రతిష్ఠలను పొంది విభవము మెయి
భారత యువత ధీరతన్ వర్థిలంగ
విశ్వమందున మన కీర్తి పెరుగు చుండు.
నిత్యపోరాట వీరులు నిష్ఠగలిగి
దేశ యువతయే చెలగంగ తీరుగాను
సర్వ సంపదల్ కురియగ సౌఖ్యమబ్బ
పౌరులెల్లరు హాయిగా వరలు చుంద్రు.//