STORYMIRROR

Gayatri Tokachichu

Classics

3  

Gayatri Tokachichu

Classics

ఇది సత్యం

ఇది సత్యం

1 min
4

ఇది సత్యము.

(హరిగతి రగడ )


కరుణాసాంద్రుని కన్నుల గాంచిన కామన లన్నియు తీరుట తథ్యము 

పురుషోత్తమునికి పూజలు సల్పిన పున్నెపు సంపద పొంగుట సత్యము 

సుగుణాభరణుని సొక్కుచు మ్రొక్కిన శుద్ధపు తత్త్వమెఱుంగుట తథ్యము 

ఖగరాజార్చిత కాంతుని పొగడిన కల్మషమంతయు తొల్గుట సత్యము 

ధరలో శాంతిని నిల్పిన దేవుని దల్చిన పాపము కాలుట తథ్యము 

'పరమాత్మా!'యని వరదుని పిల్చిన ప్రక్కన తోడుగ నిల్చుట సత్యము.

ఘనుడా కృష్ణుని గుణగానముతో కాలపు మాయను ద్రోలుట తథ్యము 

మునిహృత్పంకజ భృంగుని కొల్చిన ముక్తిఫలంబులు దక్కుట సత్యము.//



Rate this content
Log in

Similar telugu poem from Classics