వర్షం
వర్షం
జోరున కురిసే వర్షమే
కనపడుతుంది అందరికీ
ఎందరికి తెలుసు
కురిసేది వర్షం కాదు
అది తియ్యని జ్ఞాపకాల జడి వాన అని..
ఆకాశంలో మబ్బులే కనిపిస్తున్నాయా
అది హృదయపు హనీమూన్ ట్రిప్
నింగిని చేరింది అంతే..
ఆనందం ఆకాశమంత విస్తరించింది
సంతోషాల వర్షపుజల్లులు కురుస్తుంది.
ప్రేమామయ జల్లులతో ప్రకృతికాంత ఐనా
తన ప్రేయసిని మురిపెంగా ముద్దాడుతున్నది...