STORYMIRROR

Midhun babu

Inspirational Others

4  

Midhun babu

Inspirational Others

విధి విచిత్రం

విధి విచిత్రం

1 min
379

విధి చాలా విచిత్రమైనది..!


మనిషినే కాకుండా ప్రకృతిని కూడా శాసిస్తుంది .


అంతటి మహాత్తర శక్తి విధికి ఉంది 


మనిషి మనోభావాలు...మరియు..!


ప్రకృతి...లయలు... ఎప్పుడూ ఒకే విధంగా ఉంటాయి...!


చెప్పటానికి నవ్వులాటగా ఉన్న ఇది యదార్థం..!


ప్రకృతి ఒక్కోసారి ఎంతో అందంగా( మనిషి కూడా ఎంతో అందంగా ఉంటాడు ) ఉంటాయి...!


ఋతువులు మారేకొద్ది ప్రకృతిలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి...!


అంత అందంగా కనపడే ప్రకృతి.. ప్రకోపానికి కారణమైతే..!


భూకంపం... వరదలు...గాలి వాన..వీటి విలాపం విధి చేత.. చిక్కి అచేతనంగా ఉండిపోతుంది..


తిరిగి తన స్థానాన్ని చేరుకోవడానికి సమయం పడుతుంది..!


అలాగే మనిషి కూడా.. మనోభావాల చేతిలో చిక్కి.. అచేతనంగా చేష్టలు ఉడికి పోతాడు...


కారణం మనిషి ( ప్రకృతి కూడా అంతే) ఎప్పుడు ఒకే విధంగా ఉండడు..! 


ఒకసారి ఆనందంగా..కోపంగా.. ఒకసారి బాధతో ... ఒకసారి మౌనంగా... రకరకాల భావాలతో... ఇమిడి ఉంటాడు...


తను ఎప్పుడు ఆనందంగా ఉండాలి అనుకుంటాడు కానీ...!


విధి మనిషిని అలా ఉండనివ్వదు..!


విధి చేత మనిషి ఎలా వంచింపబడుతాడు... ప్రకృతి కూడా విధి చేత అలాగే వంచింపబడుతుంది..


కాబట్టి మనిషి ఎప్పుడు విర్రవీగి... పోకూడదు..!


ప్రకృతి ఎలా నిలబడుతుందో మనిషి కూడా అలాగే నిలబడాలి... విధి ఎప్పుడు ఇద్దరికీ ఒకే పాఠం చెప్తుంది..!


ఇది తెలుసుకొని ముసులుకో మానవా...


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational