ఉత్తరం
ఉత్తరం
ప్రియమైన నీకు,
నువ్వు చదవని కవితలు ఒంటరిగా మిగిలిపోయాయి, మనం నడిచిన దారిలోనే అక్షరాలను వెతుకున్నాను, ఎన్ని మలుపులో, అలుపనేది రాలేదు, కళ్ళకు ఎదురుచూపులు తప్పలేదు...!
నా మనసుకి ఎందుకు అగ్నిపరీక్ష, నా సహనానికి ఎందుకు మనోశిక్ష..!!
పదే పదే తలిచే హృదయానికి నీ స్వరం సంగీతమైపోద, గమ్యానికి చేరే అడుగులకు నీ తోడు ఒక వెలుగైపోద, మౌనంగా కదిలిపోతున్న నీ హృదయం దగ్గరైపోద, నిన్ను చేరిన రోజు నా మనసు సముద్రమైపోద...!
ఎదలో ఒక నిశ్శబ్దం మొదలయింది, ఆ నిశ్శబ్దంలో నలిగిపోతున్న జ్ఞాపకాలకు తోడుగా నిలిచిన నీ చిరునవ్వు నా మనసుని తాకింది, మెల్లగా నిద్రొస్తుంది...!!
మరి ఏనాటికో ఈ ఉత్తరాలు నీ దరికి చేరేది...!!!

