STORYMIRROR

Midhun babu

Classics Fantasy Inspirational

4  

Midhun babu

Classics Fantasy Inspirational

తోడు తనే

తోడు తనే

1 min
2


వినిపిస్తూ కనిపించే..భాగ్యమిచ్చు తోడుతనే..!

దూరాలను తొలగించే..జోషునిచ్చు తోడుతనే..!


ఈ కరోనా సమయాన..చదువునేర్పు గురువయ్యెను..

గూగుల్ తో అలరించే..జ్ఞానమిచ్చు తోడుతనే..!


ఆన్లైన్లో మోసాలకు..కొదవలేదు లింకులతో..

ఎకౌంటునే దులిపించే..చిక్కునిచ్చు తోడుతనే..!


సెర్చ్ కొడితె మరి దొరకని..సంగతేమి ఉండదులే..

ఏవైనా అందించే..సౌఖ్యమిచ్చు తోడుతనే..!


చెప్పలేని చూడతగని..సంగతులూ ఎన్నెన్నో..

లోకాలను దర్శించే..ఊతమిచ్చు తోడుతనే..!


స్వర్గమైన నరకమైన..అరచేతికి బహుమతిలే..

స్మార్ట్‌ఫోన్ గా ఊరించే..మధువునిచ్చు తోడుతనే..!


Rate this content
Log in

Similar telugu poem from Classics