నీ ప్రేమ రాగాలు
నీ ప్రేమ రాగాలు
నా హృదిని మార్మ్రోగు..నీ ప్రేమ రాగాలు..!
రామచక్కని చిలుక..నిజమౌన వేదాలు..!
వర్ణించ కుదరవవి..మాటలకు అందనివి..
నాగుండె లయలాగ..నీ మువ్వ నాదాలు..!
ఈ మట్టి మనసులో..వరదలే వరదలుగ..
నను పట్టి పలికించు..నీ మెఱుపు భావాలు..!
మేఘాల కేమెఱుక..మధువులను కురవడం..
నా కవితల నిండు..నీ తలపు చిత్రాలు..!
హంగులకు రంగులే..పులిమేను ఇంపుగా..
నా ఊహలో పొంగు..నీవైన నాట్యాలు..!
నా నేను సాక్షిగా..అలరారు సంపదయె..
ముత్యాల రతనాల..నీ హాస కిరణాలు..!
