STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ఈ నన్ను

ఈ నన్ను

1 min
1


విసుగుకే విసుగేసి..వదిలేసె ఈ నన్ను..!
నిప్పుకే మనసొచ్చి..కాల్చేసె ఈ నన్ను..!

ప్రేమకే ముద్దొచ్చి..నిండింది హృదిలోన..
మదికేదొ గడిపెట్టి..పట్టేసె ఈ నన్ను..!

పాటలకు స్వరమయే..వేడుకన తానేను..
పువ్వులా నవ్వేసి..చుట్టేసె ఈ నన్ను..!

ముచ్చటల తేలించు..నవకవన సిరిరాణి..
మౌనమే ఎఱవేసి..మింగేసె ఈ నన్ను..!

నేనన్న మాటనే..అననీదు కలనైన..
తెఱలన్ని లాగేసి..తేల్చేసె ఈ నన్ను..!

ఒకకత్తి పదునింటి..మెఱుపంటి చిన్నదే..
తననాట్య సంద్రాన..ముంచేసె ఈ నన్ను..


Rate this content
Log in

Similar telugu poem from Classics