జీవిత చక్రం
జీవిత చక్రం
ఉండేదేమో కొన్నాళ్లే, ఊడేదెప్పుడో తెలియదు నీకు
ఊహల్లోనే ఊగిసలాడుతూ, ఆశ నిరాశల చక్రంలోనే..
ఆకాశానికి నిచ్చెనలేస్తూ, అందని వాటికి అరులు చాస్తవు
పొందిన వాటిని అనుభవించక తొందరపాటు ఎందుకురా?
చుట్టం చూపుగా వచ్చినవాడివి, తిరుగు ప్రయాణం తప్పదు
నీకునీటికట్టు ఎప్పుడో ఖరారు అయ్యెను..
ఉరుకుల పరుగుల నీ జీవితం, ఊహల కందదు ఎప్పుడు
ఎంతని సంపాదించేవు, ఎవరికి కూడబెట్టేవు?
బుక్కెడు బువ్వ అరిగిందా, లక్కుగా నిద్దుర పట్టిందా..
అంతేలేరా నీ అదృష్టం, అంతకు మించి ఏమి కోరకు!
జానెడు పొట్ట నింపడానికి, బారెడు మోసాలెందుకురా?
నింగిని తాకే మేడలుండగా, గుడిసెల కబ్జాలెందుకురా?
అబద్ధాలతో అన్యాయాలతో, దోస్తాని నీకెందుకురా?
గ్యారెంటే లేని నీ బ్రతుకుపై, మోహంబెందుకు చెప్పరా?
కర్మగాలి నీ కాలం మూడితే, కనుమరుగైపోయే దేవుడా..
నవమాసాలు మోసిన తల్లి, బరువయిందా నీకురా?
రక్తం పంచిన తోబుట్టులే, శత్రువులైరా నేడురా?
వేలుపట్టి నడిపించిన తండ్రిని, వెలివేసితివి నీవురా..
చేసిన కర్మ ఊరకే పోదు, చేబదులు నీకు తప్పదురా...!!!
