వాఝరం-చరవాణీ
వాఝరం-చరవాణీ
చరవాణిని చూస్తుంది వానరమంటా,
చెట్టుచేమ చిరునామా
గూగుల్ కూడ చెప్పడంలేదంటా.
సాంకేతికత పెరిగినకొద్దీ
మనిషి మనిషితనం కోల్పోయాడంటా,
వానరం నుండే మనిషిపుట్టిన
చెట్టుచేమను నరికేయడమే విడ్డురమంటా,
అకతాయి మనసు మాదంటా
వేదించే మనసే మీదంటా,
ఏడంతస్తుల మేడకూ
పాపమే మీమార్గమంటా,
అసూయ అమరికలు పోగొట్టే
మార్గం చరవాణిలో లేదంటా.
మాయదారి మనసులీలలు
చరవాణిలో కనిపించేనంటా,
వెంటాడే నాచూపులను చరవాణి వదలకుందంటా,
బ్రతుకును బందీఖానాగా
మార్చిన చరవాణి వదిలేయమంటా,
జీవనలక్ష్యం చేర్చే ఉన్నతస్థితికే చరవాణి వాడమంటా,
గుడిలోని దేవుడికి
భక్తిమాటు కోర్కెల చిట్టా చెప్పేవంటా,
ఆకలి చల్లార్చు అరటిపండు కొబ్బరిముక్కనే దైవప్రసాదంగా
నేను భావిస్తానంటా,
ఆత్మీయతానుబంధాలు
దూరం చేసుకోక
చరవాణితో స్నేహం తగ్గించమంటాం
