STORYMIRROR

Midhun babu

Romance Fantasy

3  

Midhun babu

Romance Fantasy

తెరచాప

తెరచాప

1 min
106


తెరచాప తెగిన ఓడకు 

ఒక మార్గం చూపినావు 

 ఎదలోపల ఎగిసిపడే 

పెను అనలం అర్పినావు 


బంధించిన సందేహపు 

సంకెళ్ళే తెగిపడినవి 

 గుబులుపడే గుండెల్లో

 విశ్వాసం నింపినావు  


 అమావాస్య అంబరాన  

 అరుణోదయమైనదిలే 

 ఊహలలో జోగుతున్న 

హృది కమలం తాకినావు 


 నిలువెల్లా నిండుకున్న

 నిస్తేజం పారిపోయె 

 అణువణువున కసి రగుల్చు

 చైతన్యం రేపినావు 

 

 మదమెక్కిన హృదయంలో 

ఆరాటం అదుపుతప్పె 

 కలల మేడ కూల్చుతున్న

 భూకంపం ఆపినావు


Rate this content
Log in

Similar telugu poem from Romance