STORYMIRROR

Gayatri Tokachichu

Classics

3  

Gayatri Tokachichu

Classics

తెలంగాణా వైభవం

తెలంగాణా వైభవం

1 min
0

సీసమాలిక.

1.

రాణి రుద్రమదేవి రాజసంబుగ నిల్చి 

ప్రతిభతో చేసెతా బాలనంబు 

వీరసింగమువోలె విజయంబు సేయగా 

పరరాజులెల్లరు వణికి రపుడు 

చెఱువులన్ ద్రవ్వించి కరువుకాటకములన్ 

దీర్పంగ నీ సీమ దివిని మించె 

పూర్వమా ప్రభువులు పుడమిని తామేలి 

ప్రజల శ్రేయముఁ గోరి వరలిరచట!/


2.

దుష్టరజాకార్లు దోపిడీదారులై 

విలయంబు సృష్టించ వెఱపులేక 

కత్తులను ఝళిపించి కలముతో చెండాడి 

ప్రజలను రక్షింప పరుగుపెట్టి 

ప్రాణంబు లొడ్డుచు పల్లెపల్లెతిరిగి 

పోరాటముల్ చేయ వీరవరులు 

నా త్యాగ ఫలముల నానంద మొందుచు 

పౌరులెల్లరు నేడు పంచుకొనిరి./


తేటగీతిమాలిక.


కాకతీయుల సంస్కృతిన్ గవులు పొగడి 

తరతరంబుల విజయంపు చరిత తెల్ప 

నాటి సుందర శిల్పాలు నేటి వరకు 

నిలిచి యున్నవి ఠీవిగా వెలుగు తోడ /


భవ్యమైనతెలంగాణ పసిడి సీమ 

పైరుపంటలతో నేడు పరిఢవిల్లి 

భావితరముకు స్ఫూర్తిగా పయనమగుచు 

శాశ్వతంబుగ నిల్చిన శాంతి కలుగు.//


Rate this content
Log in

Similar telugu poem from Classics