సోహం
సోహం
#SEEDHIBAAT
అమృతం వారికి విషం నీకు
ఆభరణాలు వారికి భుజంగం నీకు
సృష్టి స్ధితులు వారివి లయ కారకుడవీవు
ఆసీనులు శయనులు వారు నాట్యమాడునది నీవు
భోగభాగ్యములు వారికి బూడిద నీకు
ఆనందలోలులు వారు భగభగ మండునది నీవు
తెలివైన దేవతలు వారు పిచ్చి మారాజు వి నీవు…
నువ్వు త్రాగిన విషమూ
ధరించు ఫణి
పూసుకునే బూడిదా
భుజించు మాంసం
నివసించే శ్మశానం అన్నీ నాకు పంచి నన్ను నీతో ఉండనీ