ఆమె ఎవరు
ఆమె ఎవరు


ఆమె ఎవరు!? ఆమె ఒక
సజీవ ప్రేతాత్మ
అందమైన కురూపి
నిశ్శబ్ధ శబ్దం
మనసున్న పాషాణం
మంచు కురిసెడి అగ్ని పర్వతం
ఆమె ఎవరు!? ఆమె ఒక
నీడనివ్వని వ్రృక్షం
కళావిహీనమైన కళాకారిని
నిరాశ నిండిన ఆశావాది
చినుకెరుగని వర్షం
వర్ణం లేని ఇంధ్రధనుస్సు
ఆమె ఎవరు!? ఆమె ఒక
రోదించే ఆనందం
ధారిద్రం నిండిన ధనలక్ష్మి
మతి లేని సరస్వతి
మనస్సాక్షి లేని కరుణామయి
స్థితప్రజ్ఙత గల చంచెల.... - USMA