భూగ్రహం
భూగ్రహం

1 min

323
అదొక దయ్యం పట్టిన దేవతలు సృష్టించిన మానవత్వం తెలియని మనుషులున్న అసమానతల శాంతి నిలయం
అక్కడ తూటాలు నాటితే బాంబులు కాస్తాయి, స్టన్ను గన్నుల కొమ్మలు మొలుస్తాయి
అక్కడ ఆరని చితి మంటల నుండీ ఆక్రందనలు వినిపిస్తాయి.
అక్కడ శవాలతో సంపర్కం కోసం రాబందులు పొంచి ఉంటాయి.
అక్కడ తల్లుల చెల్లెల్ల మానాలని తార్పిడి చేసే నాయకులు.
అక్కడ కసాయి గుండెలు సైతం కన్నీరు పెట్టే దారుణ కృత్యాలు నిత్య నైవేద్యాలు.