సంగీతం నా కవితలకు రెక్కలనిస్తే
సంగీతం నా కవితలకు రెక్కలనిస్తే
రాసాను కవితలెన్నో
వెలిగించాను చిరుదీపాలెన్నో
వ్రాసినా నా ప్రతి ఒక్క కవిత
దీపపు వెలుతురులో సంగీతంగా మరి
నా మాటలకు రెక్కలనిచింది.
ఆ చల్లని సంగీతం రాగముతో కలిసి
సెలయేటి కెరటలై గలగల మంటూ
కొత్త రాగలని ఆలాపించగా,
ఆ రాగాలు కొండ కొనల్లో
మారు-మ్రోగుతూ నాగుండె లోతుల్లో
నాటుకు పోయింది.
ఆ కవితలు ఒక్కసారిగా
మిణుగు పురుగుల వల్లే నాట్యమాడుతూ
నన్ను గిలిగింతలు పెట్టాయి.
నా మాటలకు రెక్కలొచ్చి
ఈభూమండలం పరిక్రమం చేస్తూ
నా గుండెల్లో రాగాలను ఆలాపించింది.
సంగీతం నా మాటలకు రెక్కలిచింది.