ఓక సంధ్య
ఓక సంధ్య
ఓక సంధ్య
*****************
దూరంగా సముద్ర తీరాన
తేల్లని పొంగుతో కూడిన
నీటి బుడగల మధ్య
ఊగిసలాడుతున్న ఓ వంటరీ నావ,
నింగి, నేల ఒకటిగా మారిన ఆ
సముద్రపుటంచుల్లో
బంగారు రంగు కిరణాలలో
తెలియాడుతూ
సూర్యుడ్ని హారతి పడుతుంది.
అదే సంధ్య సమయమున
చీకటి, వెలుగులు ఒకరిని ఒకరు
పెనవేసుకున్న తరుణంలో
చందమామ పై-పైకి లేస్తూ
అలసి సొలసి ఉన్న సూర్యుడ్ని
ఆకట్టుకోవాలనే ప్రయత్నంలో
ఆకాశం నుదుటి పై
బొట్టు పెట్టినట్టు రంగు-రంగుల
కిరణాలు వేదజల్లుతుండగా
వెన్నెల తన అందాలను ఒలకబోస్తూ
సముద్రపు నీటిలో జలకలాడుతుంది.
ఆ చల్లని సంధ్య ఓడిలో
దూరంగా కొండలమధ్య
కుండలతో ఓలకబోస్తూన్నట్టున్న
వెన్నెల్లో నుంచి ఓ లేడీ పిల్ల
ఛంగు ఛంగున ఉరకలు వేస్తూ
ఆనందంలో తేలియాడుతూ
తన తల్లితో
అడివిలోకి పరుగు పెట్టింది.
©లత తేజేశ్వర్ 'రేణుక'