స్నేహం...
స్నేహం...
నీ కళ్ళలో కన్నీరులా జారి..
మనసులో భావంగా మారి...
నీ ఊపిరిలో శ్వాసగా చేరి..
ప్రాణం ఉన్నంత వరకూ స్నేహితునిగా ఉంటా నేస్తమా.....
స్నేహమంటే కలిసి తిరగడం... షికార్లు కొట్టడం... సరదాగా గడపడం కాదు. ఒక ప్రత్యేక ప్రయోజనాన్ని ఆశించి మెలగడం అంతకన్నా కాదు. మనసు విప్పి మాట్లాడుకోడానికి... మనసును తేలిక పరచుకుని ఊరట పొందడానికి... తప్పులను సరిదిద్దుకుని ముందుకు సాగడానికి దారి చూపగల మోరల్ గైడెన్స్ స్నేహం. 'మేం స్నేహితులం' అని మాటవరసకు చెప్పుకుంటే సరిపోదు. సరైన సమయంలో సరిగ్గా స్పందించి నడిపించగల శక్తి స్నేహంలో కనిపించాలి.
మనకు ఎందరో పరిచయం అవుతుంటారు
అందులో కొందరే మంచి స్నేహితులవుతారు
మనతో మంచి చెడు పంచుకుంటూ
మంచి స్నేహితులు దొరకడం ఒక అదృష్టం కూడా...
"ఒక కరెక్టు వ్యక్తిని కలుసుకోబోయే ముందు, పది
మంది అనామకుల్ని విధి పరిచయం చేస్తుంది. మొదటి వ్యక్తి దగ్గరే పారిపోయేవారు అనామకులు గానే మిగిలిపోతారు"...
... సిరి ✍️
