సిరా సురుకు
సిరా సురుకు


సిరా సురుకు తగలనివ్వు
నీ ప్రతి మాట రగలనివ్వు
మనుసులోని ఉప్పెనంత
నీ రాతల్లో చదవనివ్వు
సాపి గా సాగనివ్వు
లేదా మంటల్లా చెలరేగనివ్వు
తెల్లని కాగితం పై
నీ భావనలే కరగనివ్వు
ఊహలకు ఊపిరాడనివ్వు
కాస్త సమయాన్ని ఆగనివ్వు
అనిపించిన క్షణమే
నీ సిరా ధారా సాగనివ్వు