STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

శ్రీహరి కరుణ

శ్రీహరి కరుణ

1 min
352

మధురగతి రగడ.

---------------------

శ్రీహరి కరుణ /


మరణము లేదని మమతను విరిచితి 

కఱకుగ మారితి కరుణను మఱచితి

కులుకుతు తిరిగితి గొప్పలు చెప్పితి

కలిమిని నమ్మితి గమనిక తప్పితి

వయసది మళ్లగ బరువుగ వాలితి

భయమును పొందితి బాధగకూలితి 

జీవన మిదియని చెడునిక వీడితి 

దేవుని పదములు దిక్కని వేడితి.

కాసును వదిలితి కన్నులు తెరిచితి

ఈశుని కొఱకై హృదయము పఱచితి.

 పంకజనాభునిప్రాపున చేరితి.

శంకలు వీడితి శరణము కోరితి.

 పావన మూర్తిని భక్తిగ కొల్చితి 

కావఁగ రమ్మని కాంతుని పిల్చితి 

 శిరమును వంచితి సేవలు చేసితి

వరముల నిమ్మని పల్లకి మోసితి 

కరుణను చూపెడు కల్మష హారియె 

పఱుగున వచ్చెను గోపవిహారియె.

--------------------



Rate this content
Log in

Similar telugu poem from Classics