శిల్పమా...
శిల్పమా...
నా మనసు తోటలో పూసిన
కుసుమ పరాగం నువ్వు...
నా గుండె సంద్రంలో పుట్టే
ముత్యపు జల్లు నువ్వు....
నా ఊహల రాజ్యానికి
మహారాణివి నువ్వు....
నా కనుల కొలనులో
విరిసే కలువ చందనం నువ్వు..
ఏకంగా నా అణువు అణువులో
కలిసే నా ప్రాణవాయువు నువ్వు...
నా ప్రణయ ప్రాణం శిల్పమా...
... సిరి ✍️❤️

