STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

సౌందర్యమా

సౌందర్యమా

1 min
295

గులాబీని ప్రేమిస్తే..పూసి రాలిపోయింది..! 

తనప్రేమలొ నే పడితే..నవ్వి వెళ్లిపోయింది..! 


చూపలేని నా చెలిని..ఎవరు పట్టి తెస్తారు.. 

కలగంటూ కూర్చుంటే..గిచ్చి మరలిపోయింది..! 


మూతపడని రెప్పలపై..ముద్దులెపుడు పెట్టెనో.. 

నిదురపూల తోట కాస్త..కాల్చి కదిలిపోయింది..! 


ఎంత ప్రేమ తనదంటే..తూకమెలా వేసేది.. 

మోయలేని దు:ఖాన్నే..మింగి మురిసిపోయింది..! 


సౌందర్యపు చిరునామా..చూపకనే చూపింది.. 

అంతరంగ గగనంలో..రాశి పోసిపోయింది..! 


మరి మనసు మాట..ఊట తనే నిజానికి.. 

ఒక శాశ్వత సత్యముగా..వెలిగి మిగిలిపోయింది..!


Rate this content
Log in

Similar telugu poem from Romance