పుట్టినాము
పుట్టినాము
చిరునవ్వుల హరివిల్లులు..కురిసేందుకు పుట్టినాము..!
సహజీవన సౌందర్యము..పెంచేందుకు పుట్టినాము..!
పచ్చదనం కాపాడే..పని మనదని చెప్పాలా..
ఈ పుడమిని స్వర్గముగా..నిలిపేందుకు పుట్టినాము..!
పశువులైన పక్షులైన..మనకు తోటి నేస్తాలే..
మనం దైవ ప్రతి'నిధు'లని..చాటేందుకు పుట్టినాము..!
అందమైన అమాయకత..మన సొంతం ఎప్పటికీ..
మెఱుపుమల్లె తీగలలా..ఆడేందుకు పుట్టినాము..!
అనంతమౌ జ్ఞానానికి..ఆలయమే ప్రతిహృదయం..
ప్రతి'భా'వన మధుసీమలు..ఏలేందుకు పుట్టినాము..!

