STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

పరవశం

పరవశం

1 min
244

వలపు ఎంత గడుసరిదో..తెలుపలేను సత్యముగా..!

వయసు ఎంత అల్లరిదో..నిలువలేను సత్యముగా..!


ఎదురుచూపు ఊయలలో..పరవశించు చిలుక ఇదో..

మనసు ఎంత తుంటరిదో..చూపలేను సత్యముగా..!


మోసమెలా చేస్తుందో..మాయగాలి నా ఆశలు..

తలపు ఎంత తెంపరిదో..చెప్పలేను సత్యముగా..!


కవితలలో ఊరేగే..చొరవెందుకొ వెర్రి గాక..

పదము ఎంత విరిసరిదో..పలుకలేను సత్యముగా..!


నటియించగ వెనుకాడని..నయవంచన దారెందుకొ..

అడుగు ఎంత టక్కరిదో..అలుగలేను సత్యముగా..!


రామాయణ భారతాలు..సరిరావుర ప్రియతమా..

కలము ఎంత ఒంటరిదో..కదపలేను సత్యముగా..!


Rate this content
Log in

Similar telugu poem from Romance