ప్రతి జన్మలో
ప్రతి జన్మలో
ఒసేయ్ తింగరి........!!!!!!!!
వింటున్నావా మరి..!!
నీతోనే నా పయనం గాలిలా మారైనా సరే..!!
నడిచిన ప్రతిదారి
మన అడుగుల సడిలోన..!!
చిగురించిన వసంతాలెన్నో
నా ఊహల్లో న..!!
రాలి పడిన ఆకులెన్నో
నా జ్ఞాపకాల్లోన..!!
మోడైన నా హృదయానికి
వసంతరాగమై చేరావు నా జీవితాన ..!!
మది అంతరాలలో
గాయాలతో నిదురించిన
నా ప్రేమకి ఊహల రెక్కలు తోడిగి అంబరాన్ని తాకించావు ఈ సంధ్యా సమయాన..!!
కాల గమనం తేలీని
మన ప్రయాణంలో ఎన్ని బాసలో
ఎన్నిఊసులో ప్రతి మలుపులోన..!!
నా కోసం నువ్వు నీ కోసం నేను
జన్మించాలి ప్రతి జన్మలోన.........!!!!!!