ప్రణయరాగ
ప్రణయరాగ
నవ్వుపూల సెలయేఱే..నేస్తంలా కూడినది..!
ఆనందపు చిరునామా..దీపంలా కూడినది..!
నిజమౌనమె ప్రేయసిగా..అల్లుకున్న దీవేళ..
చెలిమివేణు రవమేమో..ప్రాణంలా కూడినది..!
నీవులేని నేనెక్కడ..ఈ మాటల కేమెఱుక..
నీ తియ్యని చూపేమో..ఛత్రంలా కూడినది..!
జీవితమిది ప్రణయరాగ..మంజరియే తోడుగా..
నీ అడుగుల జాడ ఇపుడు..మార్గంలా కూడినది..!
నాట్యమాడు పచ్చదనం..గోర్వెచ్చని గాలిలో..
మంచుపూల పరవశమే..కావ్యంలా కూడినది..!
ఏ కథలకు అందనిదే..నీలిగగన సోయగం..
వ్రాయరాని మధురోహల..పద్యంలా కూడినది..!

