STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ప్రియా సఖియే

ప్రియా సఖియే

1 min
259

చుట్టేసిన సుడిగాలిని..ప్రేమిస్తూ పోయాను..!

పదేపదే తనకౌగిట..మరణిస్తూ పోయాను..!


మనసుకన్న ప్రియసఖియే..జాడలేదు లోకాన..

నన్ను నేను పలువిధాల..సాధిస్తూ పోయాను..!


చేసుకున్న బాసలన్ని..గాలిలోన రాతలే..

నోరారగ తలరాతను..నిందిస్తూ పోయాను..!


నన్ను చూసి చేమంతుల..వనాలెన్ని నవ్వెనో..

ఎగతాళుల జాతరనే..తిలకిస్తూ పోయాను..! 


మాటల కత్తులు చూపుల..బాంబులకే వినోదం.. 

చెప్పుకోను వల్లగాక..చింతిస్తూ పోయాను..!


పెనుఆశల సుగంధాలు..అల్లుకున్న వాడనే..

వదలలేక వదలలేక..మోహిస్తూ పోయాను..!


అనుభవాల జ్ఞానమెంత..అద్భుతమో మనసా 

తిరుగులేని నా ప్రేమ..ప్రవహిస్తూ పోయాను..!


Rate this content
Log in

Similar telugu poem from Romance