ప్రేమలేఖ
ప్రేమలేఖ
ఎవరు నీవు?
నీ అంతట నీవు గా నా ఉనికి మూలానికి నడిచి వచ్చి నా జీవిత కేంద్రానికి దారిని కనుగున్నావు.
ఎవరు నీవు?
సునిశితం గా నన్ను స్పృశించి లాలించి నీ ఒడిలో చిన్ని పాపాయిని చేసి ఆడిస్తావు.
అంతలోనే భయంకర విస్పోటనాన్ని సృష్టించి నా మదిని అల్లకల్లోల పరుస్తావు.
నీవెవరివని నేను చెప్పగలను!
నీవు నా తోడుంటే అనంత సాగరాల అవతలి తీరాలు సైతం దాటుకుంటూ అడుగులు వేస్తా!
నీవు నా తోడుంటే జీవితపు చిక్కుముడులన్నీ విప్పేందుకు ప్రయత్నిస్తాను!
అదే నీవు నాకు దూరం అవుతే
ఆ ఊహే నాకు భయాన్ని కలిగిస్తుంది.నన్ను అజ్ఞాని గాను అంధకారురాలిగాను మారుస్తుంది.
నీవంటే నాకెంతో ఎంతో ఇష్టం
ఎంత ఇష్టం అంటే నీ నవ్వునే చూస్తూ కాలం గడపాల్సినంత ఇష్టం.
ఎంత ఇష్టం అంటే
నా చివరి శ్వాస అంటూ విడవడం జరిగితే అది నీ ఒడిలోనే జరగాలి
ఇంతకీ ఇప్పుడు చెప్పనా నెవెవరివని!
నేను భద్రం గా దాచుకున్న నా వ్యక్తిత్వపు ఛాయలను బహిర్గతం చేసి నాకంటూ ఒక రూపాన్ని ఇచ్చిన వ్యక్తివి నువ్వు
నా స్నేహితుడిగా నా జీవితాన్ని సంపూర్ణం చేసిన వ్యక్తివి నువ్వు
కానీ నే కోరుకునేది నా జీవిత భాగస్వామిగా నా జీవితాన్ని పరిపూర్ణం చేసి నా ఆరాధ్య దైవం గా మిగిలిపో♥️
ఎప్పటికీ నీ దాన్నే అయిన....

