నీతో ఉన్న క్షణం
నీతో ఉన్న క్షణం
నీతో ఉన్న క్షణం
నీవు పక్కనుంటే,
క్షణం ఇక నిశ్చలం,
నా హృదయంలో ఇక
అనంతకాల పదిలమాయెనే!!!
నీ నవ్వు తాకినప్పుడు,
లోకమే ఒక రంగుల కళగా మారేనే!!!
నీ మాటలతో గడిపిన క్షణం
నా జీవన గీతంలో స్వరాగాల వెల్లువాయెనే!!!
నీ చూపు నన్ను తాకిన వేళ,
నిశ్శబ్దం కూడా కవిత్వమై ఉప్పొంగెనే!!!
నీతో ఉన్న ఆ క్షణం
శాశ్వత జ్ఞాపకంగా నిలిచి పోయేనే!!!
జీవితం ఆసాంతం నేను వెతికేది
నిన్ను చూసి గడిపిన ఆ అమూల్యమైన
"నీతో ఉన్న క్షణ కాలానికై"!!!

