ప్రేమెలా
ప్రేమెలా
ఘాటైన మాటలే శూలమైతగిలితే మనసెలా అతకాలి?
దిక్కులే వేరుగా బంధాన్ని కాదంటె ప్రేమెలా పోవాలి?
తోడుగా నీతోటి నూరేళ్ల జీవితము కావాలి నాకెపుడు
మాటలే లేకుండ మౌనముగనీవుంటె వరమెలా అడగాలి?
చూపుతో కట్టేసి నీవెంట రమ్మంటు ప్రణయాన్ని రేపావు
పూవంటి అధరాలు అందించబోకుంటె తేనెలా తాగాలి?
మెల్లగా అడుగేసి మువ్వలే రవళించి తీయగా పిలిచావు
సిగ్గుతో ముగ్ధలా అటుతిరిగినిల్చుంటె రూపెలా చూడాలి?
ప్రసన్నకు వున్నాయి నిజమైన స్నేహాలు ప్రాణాతి ప్రాణంగ
కలకాల బంధమై పచ్చంగ ఎదిగేటి లతనెలా అల్లాలి?

