STORYMIRROR

Mirapa Mahesh

Inspirational

4  

Mirapa Mahesh

Inspirational

★★ పరాకాష్ట ★★

★★ పరాకాష్ట ★★

1 min
260


హృదయాంతరంగాల్లో మారుమ్రోగే

నిర్విరామ స్పందన తరంగాలలో..

ఏదో ఒకనాడు సద్భావం 

ఉద్భవించక పోతుందా.?


మనిషితనాన్ని సమూలంగా 

పాతిపెట్టిన మొరటు గుండె

సమాధి తలుపు తెరిచి

మానవత్వపు తోడునొసగదా.?


అడగకముందే స్పందించేది సహృదయం..

అది మానవతకు మహోదయం.

సహాయం, క్షమాగుణం,ఉద్ధరింపుల్లో..

పరాకాష్టను ప్రదర్శించడమే దాని నైజం.


ధరణి దాహార్తిని చూసి నిలువెల్లా

కన్నీరుమున్నీరుగా కుమ్మరించే

నింగిమబ్బుల వర్షధారల 

సహాయం సహృదయత..


నాగటి కోరలతో నిలువునా తనువు చీల్చినా

ఆకలితీర్చే పంట ముద్దలను హద్దులేక తినిపిస్తున్న నేలతల్లి క్షమాగుణం సహృదయత..


నూటికో కోటికో మనిషి కాదు..

మనిషంటేనే మానవకోటి..

సహాయతను అణువణువునా

చూపుతున్న ప్రకృతిని చూసి

మానవతను., మనిషితనాన్ని

అంతరాలు వీడి చాటుకోవడమే

మన సంస్కృతి మనుగడకు

సుహృద్భావ పోటీ..!


    *****************


Rate this content
Log in

Similar telugu poem from Inspirational