ఓ మనసా...
ఓ మనసా...
మూసుకున్న నీ మదిగోడలపై
నా తలపులేసిన చిత్రాలన్నీనీ కంటబడితే మరలివస్తావనుకుంటున్నా.
గుప్పెడు జ్ఞాపకాల గవ్వలకోసం జల్లెడపట్టిన సైకతరేణువులు
నీ పాదాలపై నా చిరునామా వ్రాస్తాయనే నమ్మకం మాత్రమే మిగిలింది
అదే నమ్మకం ... అనుక్షణం నా ఒంటరితనాన్ని వెక్కిరిస్తూ ఉంటుంది.

