STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

ఒక్కసారి

ఒక్కసారి

1 min
161


వస్తావోరావో నువు పలుకవేమి ఒక్కసారి

చూస్తానోలేదో నిను చూడవేమి ఒక్కసారి 


ఎన్నేళ్ళనీ నిరీక్షణ ఎవరికొరకు ఈవీక్షణ 

నీవేకద నాప్రాణం తలచవేమి ఒక్కసారి 


పిలిచి పిలిచి అలసిపోతి వినబడలేదచెలి నీకు

ఒయ్యారం ఒలకబోయ నిలువవేమి ఒక్కసారి 


నీధ్యాసతొ కనులుమూసి కలలుకంటు ఉన్నానూ 

కలలోనికి వచ్చి నీవు కలవవేమి ఒక్కసారి 


నువుపట్టిన కుందేటికి మూడుకాళ్ళు ఉంటాయా 

సడలించీ మొండిపట్టు విడువవేమి ఒక్కసారి


Rate this content
Log in

Similar telugu poem from Romance