న్యూ ఇయర్
న్యూ ఇయర్


నవ వత్సరానికి స్వాగతం
పలుకుతోంది అవనీ లోకం
కొత్త సంవత్సరపు సంబరం
తాకుతోంది అంబరం
మారెను చరిత గడిచిన కాలం
నిర్దేశిస్తూ గమ్యం.
ప్రవేశిస్తోంది మరో వర్షం
ఆనందం ఆహ్లాదం
సంతోషాలు సంబరాలు
కష్టాలు కన్నీళ్లు
దుఃఖాలు సంతాపాలు
అన్ని చవి చూపిన వత్సరం
తిరిగి రానని తెలియజేస్తూ...
పలికింది శాశ్వత వీడ్కోలు
తెలియ చెప్తూ నూతన పేజీకి స్వాగతాలు
నింగికెగసిన పిఎస్ఎల్వి లు
నేల రాలిన దిశలు
అన్నింటినీ తనలో దాచి
ఆశల లోకానికి వారధిగా మారి
ong> నడుపుతోంది మనల్ని మునుముందుకు.. చరిత్రలో చేరిన మరో పేజీ ఘన కీర్తి బావుటా నింగికెగసినా దిగజారిన మానవత్వం పాతాళానికి తొక్కినా బీడు నేలన చిలకరించిన చిన్న నీటి చుక్క కు.. చిగురులేసే మొలకలా మరో కొత్త దశాబ్దికి శ్రీకారం ఆశల అశ్వం పై విహారం విజయకేతనం ఎగురవేయాలనే.. మానవ సహజ లక్షణం మానవీయత కు కట్టాలి పట్టం తెరచి చూడాలి మనోనేత్రం చేరుకోవాలి విజయశిఖరం కావాలి మంచిదో ప్రతివారూ భాగస్వామ్యం కావాలి చెడు నిష్క్రమణం ఈ దశాబ్దం ఇవ్వాలి మనోల్లాసం అందరికీ ఆనందాల హరివిల్లు అవ్వాలి సొంతం