నువ్వు ఎవరు అని ????
నువ్వు ఎవరు అని ????
విడిచిన శ్వాస నీ అడుగు
నడిచిన నేలను అడుగు
తాకే గాలిని అడుగు
వేసిన అడుగులను అడుగు
బాధ పడిన క్షణాల్ని అడుగు
చేదు అనుభవాల్ని అడుగు
నిద్రపోని రాత్రుల్ని అడుగు
జారిన కన్నీళ్లనీ అడుగు
జరిగిన అవమానాల్ని అడుగు
చేసిన త్యాగాల్ని అడుగు
కోల్పోయిన అవకాశాల్ని అడుగు
చేసిన ప్రయత్నాలను అడుగు
గడిచిన కాలాన్ని అడుగు
వెళ్లిపోయిన సమయాన్ని అడుగు
ఓడిపోయిన సందర్భాలను అడుగు
ఒంటరిగా బ్రతికిన రోజుల్ని అడుగు
నువ్వు ఎవరు అని
