అయినా విజయం వరించలేదు
అయినా విజయం వరించలేదు
బ్రతుకు పోరు బాటలో నిలకడ లేని మనుషిని నేను
ఆత్మ గౌరవం నిలుపుకోవడానికి అవకాశాల కోసం పరుగులు
చేయని ప్రయత్నం లేదు , పోరాడని క్షణం లేదు
అయినా విజయం వరించలేదు
సమాధానం లేని ప్రశ్నలు , కాలం పెట్టే పరీక్షలు అయినా సరే ,
వెనకడగు వేయకుండా ముందుకు దూసుకెళ్తున్న
అయినా విజయం వరించలేదు
ప్రాణం పోయే ఒక్క క్షణం ముందు అయినా
విజయ కాంక్ష ని ఆస్వాదించాలని అశ
ఆ ఆశలన్నీ అవిరి అవుతున్నా అడియాశలు అవుతున్నా సరే
ప్రయత్నాల్ని కొనసాగిస్తున్న
అయినా విజయం వరించలేదు
నాకు విజయం మాత్రమే వరించలేదు కానీ నేను ఎప్పుడూ ఓడిపోలేదు , ప్రయత్నం లో నేను ఎప్పుడు అలుపెరగని బాటసారి నే
ఇది ఓడిపోతున్న ప్రయత్నాలు చేస్తూ మళ్ళీ మళ్ళీ ఓడిపోతూ
గెలుపు కోసం పరుగులు తీస్తున్న వాళ్ళకి అంకితం
ఇట్లు ఒక ఫెయిల్యూర్ ..........