STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నువ్వు అంటే ఇష్టం

నువ్వు అంటే ఇష్టం

1 min
328


ఎడతెరిపే లేని పసిడి నీనవ్వులు భలె ఇష్టం..!

కనకాంబర వీధులంటి నీ సొగసులు భలె ఇష్టం..!


నీవు నేను కలిసామా వసంతాల వేడుకలే..!

ప్రణయభావ హిమనదములు నీ కన్నులు భలె ఇష్టం...!


విరహాలకు గుబులెత్తును కలనైనా దరిచేరవు..!

నీ సోయగ రాశి చిమ్ము సుగంధములు భలె ఇష్టం..!


పానుపుతో పనిలేదని చెబుతున్నవి ఆ తారలు..!

విషయాలకు అతీతమౌ నీ పలుకులు భలె ఇష్టం..!


నీలి కురుల పరువాలకు కబురులేల చెప్పనోయి..!?

చెలిమినిధికి నడిపించే నీ పదములు భలె ఇష్టం..!


వేదాంత వేణువూదే గానం కాస్త ఆగు..!

నీ తియ్యని మౌనజగతి ఆవెలుగులు భలె ఇష్టం..!


Rate this content
Log in

Similar telugu poem from Romance