నమ్మనంటోందీ
నమ్మనంటోందీ
నీవు లేవు అన్న నిజం నన్ను కలచివేస్తోందీ
నీవు రావు అన్న మాటే మనసు నమ్మనంటోoదీ
కనుల ముందు నీ రూపమే కళకళ మెసలుతూ ఉంటే
రూపు మాసి పోయావన్నది చూపు నమ్మనంటోoదీ
చెవులకేమో నీ పిలుపులే ప్రేమగా వినిపిస్తోంటే
నీ స్వరం ఆగిపోయిందని మదియే నమ్మనంటోoదీ
నా హృదిపై నువ్వు చేరీ గుస గుసలే చెబుతోంటే
ప్రకృతిలో కలసినావని ప్రాణం నమ్మనంటోoదీ
అల్లుకున్న కమ్మని ఆశల కలల గూడు చూస్తోంటే
గూడు వదిలి వెళ్ళావని కలత నమ్మనంటోoదీ
ఇద్దరము ఒకరికి ఒకరై గడచిన మధుర కాలమూ
ప్రకృతి ఇక మరిరాదన్నది నిజం నమ్మనంటోoదీ...